Friday, 31 July 2026 08:15:42 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

Date : 24 January 2026 08:17 PM Views : 247

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో శనివారం16 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహాత్మా సంతోష్ అధ్యక్షతన, రాజనీతి శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి జాతీయ ఓటరు దినోత్సవ అవగాహన ర్యాలీ, ఓటరు ప్రతిజ్ఞ మరియు విద్యార్థుల కు పోటీలు నిర్వహించారు. అనంతరం కళాశాలలో ప్రజాస్వామ్యంలో మహిళా ఓటర్ల పాత్ర అంశంపై విద్యార్థులకు వ్యాసరచన ,వక్తృత్వ మరియు చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్షెట్టిపేట తహసిల్దార్ దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఓటరు అవగాహన కలిగి ఉండటం ముఖ్యమని సూచించారు. ప్రజాస్వామ్యానికి ఓటు ఒక బలం అని పేర్కొన్నారు. అనంతరం తహశీల్దార్ మరియు కలశాల ప్రిన్సిపాల్ చేతుల మీదుగా వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి సంధ్యారాణి, కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ టి సురేష్, అధ్యాప బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :