ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / కురవి : ప్రకృతిని ఆరాధించే మహోన్నతమైన పండుగే సీత్లా పండుగ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కురవి మండలం పెద్దతండ గ్రామంలో ఘనంగా నిర్వహించిన సీత్లా పండుగ వేడుకల్లో సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప గిరిజన సంప్రదాయ పండుగే సీత్లా పండుగ. గిరిజనుల సంస్కృతి, ఆచారాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే సీత్లా పండుగను పెద్దతండ గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళలు గ్రామ సమీపంలోని అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తండాలోని ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన సంప్రదాయ గిరిజన నృత్యాలు, ఆటపాటల్లో పాల్గొని గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గిరిజన నాయకులు, మహిళలు, యువత, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News