ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ భూక్యా జానకి రాములు నాయక్ అన్నారు. మరిపెడ మండలం మూలమర్రి తండా జీపీ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జానకి రాములు మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఆడబిడ్డ కు సారె పెట్టి, మహిళలను గౌరవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. మూలమర్రి తండా గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. 20 గ్రూపుల్లోని 221మంది సభ్యులకు చీరలను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజావత్ నెహ్రూ నాయక్, భూక్యా వెంకన్న నాయక్, వంకుడోత్ రవి, భరత్ నాయక్, సీత్యా, భూక్యా వీరన్న, ఉప సర్పంచ్ కిషన్ నాయక్, వార్డు సభ్యులు హరి సింగ్, అరుణ, సోమాని, నీలమ్మ,సోమ్లి, సునీత, గ్రామ కార్యదర్శి ప్రణయ్, సిసి చందు, సిఏ పద్మ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News