ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటుతున్నా బకాయిలు అందకపోవడంతో మొదలైన ఆర్థిక ఇబ్బందులకు అనారోగ్యం తోడు కావడంతో రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం పోలీస్ సాయుధ దళంలో ఎస్ఐగా పనిచేసి కే.మైసయ్య గత ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందారు.ఆయన ఉద్యోగ విరమణ బకాయిలు సుమారు రూ.50-60 లక్షలు రావాల్సి ఉండగా అవి ఇప్పటికీ అందకపోవడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు పడడంతో పాటు మైసయ్య అనారోగ్య సమస్యతో బాదపడుతుండగా ఆయన భార్య భాగ్యమ్మ బుధవారం రాత్రి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కి తరలించారు. పరిస్థితి విషమించడంతో మైసయ్య బుధవారం అర్ధరాత్రి దాటాక మృతి చెందారు. ఆసుపత్రి బిల్లులకు ఇబ్బందిగా ఉందని తెలియడంతో విశ్రాంత పోలీసు అధికారుల సంఘం కొంతమేరకు డబ్బులు చెల్లించి, మృతదేహాన్ని ఆయన ఇంటికి పంపించారు. దీంతో ఉద్యోగ విరమణ పొందిన మరికొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
Admin
E Nivas News