ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : వైద్య విధాన పరిషత్, పెద్దపల్లి జిల్లా మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాత శిశు సెంటర్లో సామూహిక వినతి పత్రం సమర్పించారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల వేతనాలను 010 అకౌంట్ ద్వారా చెల్లిందాలని, అలాగే వైద్య విధాన పరిషత్ను రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ, మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాత శిశు సెంటర్ మెడికల్ సూపరింటెండెంట్ డా. వి. రాజశేఖర్ కు ఉద్యోగులు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ సంకల్పంలో భాగంగా సెకండరీ హెల్త్ సర్వీసెస్ బలోపేతం చేయడానికి అవసరమైన సిబ్బంది సంఖ్యను ప్రతిపాదించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, సహాయక సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News