Thursday, 30 July 2026 10:40:05 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

రైతులకు భరోసానిచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే...

సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

Date : 19 November 2025 06:12 PM Views : 319

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతులకు భరోసానిచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని మల్లారం, వెంకటాపూర్, నాగెపల్లి, భట్టుపల్లి వరి ధాన్యం కేంద్రాలను ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, ఆరెంద, స్వర్ణపల్లి, అడవిసోమన్ పల్లి, చిల్లపల్లి, మల్లేపల్లి, పోతారం, సిరిపురం కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ నాయకులు, రైతులు, హమలిలతో కలిసి ప్రారoభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని, రైతుకు మద్దతు ధరతో పాటు క్విoటాల్ కు రూ.500 బోనస్ ప్రభుత్వం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుందని అన్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు దళారుల బారినపడి మోసపోకుండా ఉండేందుకు, ధాన్యం అమ్ముకోవడానికి వెళ్లే దూర భారాన్ని తగ్గించేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలోనే అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి, ప్రస్తుత ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఊరూర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించడం జరిగిందని అన్నారు. ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం తాలు, తప్ప పేరిట వరి ధాన్యంలో కోత విధించేదని, కాంగ్రెస్ ప్రభుత్వం లో ఒక్క గింజ కూడా కటింగ్ లేకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. రైతులకు రైతు భరోసా, రూ.2లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్లు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాపు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, సిరిముర్తి ఓదెలు, లెక్కల కిషన్ రెడ్డి,కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి-మొండయ్య, దేవల్ల విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి, మాజీ ఎంపిపి కొండ శంకర్, ఏఎంసి మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, నాయకులు బూడిద శంకర్, ఊట్ల అనిల్, ఎరుకల ప్రవీణ్, అక్కపాక సంపత్, బిబ్బర కిషన్, తాళ్ల సత్యనారాయణ, గుమ్మడి రాజయ్య, రాజేంద్ర ప్రసాద్ తిరుపతి రెడ్డి, మానేం రాజేందర్, సత్యనారాయణ, జక్కు బాపు, చాట్లపల్లి శ్రీనివాస్, పందిళ్ళ నర్సయ్య, కాసిపేట వెంకటస్వామి, పొట్ల రవి, గూడ సత్యనారాయణ, గూడ మల్లారెడ్డి, కొండ మహేందర్, దబ్బేట శ్రీశైలం, మండపు మధు, కొటారి బాపు, కుంభం సమ్మిరెడ్డి, కనవేన కిష్టస్వామి, అప్పాల కుమార్, గట్టు శివ శంకర్, కుడుదుల మహాదేవ్, రవికుమార్, ఎరుకల రవి, శశికళ, ఎడ్ల ప్రమీల, కారెంగుల తిరుపతి, ఇసంపల్లి సత్యనారాయణ, తమ్మిశెట్టి సదయ్య, ఆత్కూరి రాజేశం,అనిల్, సాగర్,రాజేందర్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, నాయకులు, కార్యకర్తలు, రైతులు, హమాలీలు, మహిళలు, ఐకెపి అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :