Friday, 31 July 2026 06:43:08 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అయిదు తరాల అపురూప సమ్మేళనం

Date : 26 December 2025 12:19 AM Views : 304

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఒక్క వేదికపైకి చేరిన 200 మంది కొంతం కిష్టయ్య కుటుంబ వారసులు ఆదర్శం ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి విలువలు ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇదొక ప్రత్యేకత సంతరించుకుంది. ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 200 మంది ఒక వేదికపై కలుసుకుని ఆనందానుభూతిని పొందిన సందర్భమిది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కొంతం కిష్టయ్య, అమ్మాయి దంపతుల వారసులు గురువారం హైదరాబాద్ కొండాపూర్ లోని అపర్ణా సెరేన్ కమ్యూనిటీ లో కలుసుకున్నారు. 80 ఏళ్ల వృద్ధులు మొదలుకొని ఆరు నెలల శిశువుల వరకు అయిదు తరాల వారు ఇందులో పాలు పంచుకున్నారు. సామాన్య నేపథ్యం నుంచి మొదలైన ఒక కుటుంబం, కేవలం చదువునే ఆయుధంగా మలుచుకుని ఐదు తరాల సంబరాన్ని జరుపుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ కుటుంబం, నేడు సమాజంలో పదిమందిని నడిపించే నాయకత్వ స్థానాలకు ఎదగడం వారి కష్టానికి నిదర్శనం. ఈ అపురూప కలయికలో నాటి కష్టాలను తలుచుకుంటూ, నేటి విజయాలను చూసి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. తమ మూలాలను మరువకుండా, విద్య ద్వారా తలరాతను మార్చుకోవచ్చని నిరూపించిన ఈ ఐదు తరాల ప్రయాణం నేటి సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తి. పెద్దల ఆశీస్సులు, పిల్లల ప్రగతి కలగలిసిన ఈ వేడుక ఒక అద్భుత దృశ్యంగా నిలిచింది. ఈ సందర్భంగా కుటుంబ వృక్షాన్ని చిత్రరూపకంగా ప్రదర్శించారు.‌ తర్వాత ప్రతి కుటుంబానికి చెందిన వారు పరిచయం చేసుకున్నారు. ఆటపాటలు, చిన్నారుల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.‌ మంథని ఫ్యామిలీ గ్రూప్ వాట్సాప్ బృందం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి విజయవంతం చేసింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి అనేక వ్యయ ప్రయాసలకోర్చి, చలిని కూడా లెక్క చేయకుండా అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. కుటుంబ పెద్దల విలువలు, సభ్యులందరి ఫొటోలు, పరిచయాలతో ప్రత్యేక పుస్తకాన్ని ప్రచురించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. విదేశాల్లో ఉంటున్న కుటుంబ సభ్యులు ఆన్లైన్ లో పాల్గొన్నారు. ఇలాంటి వేడుకలు ప్రస్తుతం అత్యంత అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కుటుంబ సమ్మేళనంలో లక్షెటిపేట మరియు మంచిర్యాల నుండి పలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: