ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విజయ్ దివస్ పురస్కరించుకొని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకే బోథ్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా విజయ్ దివస్ వేడుకలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ 11 రోజుల దీక్షకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేసీఆర్ దీక్ష విరమించాలని ప్రకటించిన రోజును విజయ్ దివస్ గ జరుపుకుంటున్నామని అన్నారు. విజయాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రం జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News