ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడి రేవు గోదావరి వద్ద గల పద్మ పూరి కాకో ఆలయం వద్ద మంగళవారం దండారి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు ఈ దండారి ఉత్సవాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం పరిపాటిగా మారింది. వీరంతా ఎంతో భక్తిశ్రద్ధలతో గుస్సాడి వేషధారణ గావించుకొని వారి యొక్క భాషలో భక్తి గీతాలు ఆలపిస్తూ అమ్మవారిని కొలుస్తుంటారు. దీంతో కార్తీకమాసం అంతా సందడిగా మారనుంది. ఈ ఉత్సవాలను తిలకించడానికి జిల్లాలోని నాయకులతో పాటు ఉన్నతాధికారు లు కూడా వస్తారు.
Admin
E Nivas News