Friday, 31 July 2026 12:45:09 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అనారోగ్యంతో బిజెపి నేత ముల్కల మల్లారెడ్డి మృతి..

Date : 23 July 2026 09:13 PM Views : 58

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బిజెపి నేత చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముల్కల మల్లారెడ్డి60 గత ఆరు నెలలుగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ గురువారం హైదరాబాదులోని ఆయన స్వగృహంలో మృతి చెందాడు. కాగా మంథని స్వగ్రామానికి చెందిన మల్లారెడ్డిప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న తరుణంలో, బిజెపి చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేటు విద్యాసంస్థలను నెలకొల్పి పేద విద్యార్థులకు విద్యను అందించడంలో తన వంతు సహాయంగా కృషి చేశాడు. దానికి తోడు అతడు భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించడంతో పార్టీ అధిష్టానం మల్లారెడ్డి మంచిర్యాల నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కూడా కేటాయించింది. అప్పుడు దాదాపు 12 వేల ఓట్లు కూడా వచ్చాయి. దీంతో ఆయన కాస్త బిజెపి నాయకత్వంలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. గత ఆరు నెలల క్రితం మెదడులో కాస్త నొప్పి రావడంతో ఆసుపత్రిలో చికిత్స చేసుకోగా బ్రెయిన్ క్యాన్సర్ అని తెలియడంతో అప్పటినుండి ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూనే ఉంటూ పలు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇటీవల మళ్ళీ వ్యాధి తీవ్రం కావడంతో చికిత్స కోసం వెళ్లగా పక్షవాతం రావడంతో మరింత పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం ఆయన స్వగృహంలో మృతి చెందినట్లు కుటుంబీకులు, పార్టీ నాయకులు తెలిపారు. మల్లారెడ్డి మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని పలువురు బిజెపి నాయకులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :