Thursday, 30 July 2026 04:51:27 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తాం...

కేంద్ర మంత్రి బండి సంజయ్

Date : 17 July 2026 08:13 AM Views : 40

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్ర రాజధాని సైదాబాద్‍లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్‌లో హిందూ విద్యార్థులకు కల్మా, సురా ఫతేహా చదవాలంటూ హోంవర్క్ ఇచ్చారన్న వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బరితెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని కల్మా, సూరహ్ ఫతే చదవాలని హుకుం జారీచేయడందుర్మార్గం అని మండిపడ్డారు. సక్సెస్ స్కూల్‍పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన ఈ ఘటననుసమాజమంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ ఘటనపై సెక్యూలర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని తాము అధికారంలోకి రాగానే హిందూవిద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామన్నారు. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల ఆటో డ్రైవర్ భరత్ ను పోలీసులు, మజ్లిస్ నాయకులు వేధింపులకు గురి చేశారని భరత్‍ను వేధించిన పోలీసులు, మజ్లిస్ నాయకులపై చర్యలుతీసుకోవాల్సిందేనన్నారు. ఇలాంటి ఘటనలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తే తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. భరత్ రాసిన దాంట్లో తప్పేముందన్నారు. హిందువులను కించపర్చేలా ఉర్దూలో ఆటోల్లో, గోడలపై రాసుకున్న వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదు? అని నిలదీశారు. మజ్లిస్ వాళ్లకో న్యాయం, భరత్ కు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా హిందువులంతా ఏకమై ఐ కమత్యంగా ఉండాలన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :