ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షట్ పేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఆదివారం పీజీ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో మంజూరైన 1160 సోలార్ కనెక్షన్లను గ్రామ సర్పంచ్ నల్గొండ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు సహకారంతోనే వెంకట్రావుపేట గ్రామం మోడల్ సోలార్ విలేజ్ స్కీం కింద మంజూర అయిందన్నారు. ఎమ్మెల్యే వెంకట్రావుపేట గ్రామాన్ని దత్తత గ్రామంగా స్వీకరించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పాటుపడుతుంటారని తెలిపారు. దాదాపు 20 కోట్ల విలువగల సోలార్ కనెక్షన్లు గ్రామంలో ఏర్పాటు చేయడం వల్ల గ్రామ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అంతేకాకుండా విద్యుత్ వాడకం తగ్గి అలాగే మిగులు విద్యుత్ తో వినియోగదారులకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడి ప్రభాకర్, ఏ ఈ గణేష్, ఆర్టీఏ నెంబర్ అంకతి శ్రీనివాస్, సర్పంచ్ కోన తిరుమల వార్డు సభ్యులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News