Thursday, 30 July 2026 10:40:54 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఆరెంద జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా న్యూట్రిషన్ ఫుడ్ – పోషణ ఆహారోత్సవ కార్యక్రమం

Date : 20 December 2025 06:06 PM Views : 321

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఆరెంద జడ్.పి.హెచ్.ఎస్ లో కాంప్లెక్స్ హెచ్‌ఎం నరసింహారావు ఆధ్వర్యంలో న్యూట్రిషన్ ఫుడ్ – పోషణ ఆహారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 55 మంది విద్యార్థులు చురుకుగా పాల్గొని, వివిధ రకాల పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. ఆయా ఆహార పదార్థాల్లో ఉండే పోషక విలువలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులే స్వయంగా వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కాంప్లెక్స్ హెచ్‌ఎం నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. చిన్నప్పటి నుంచే పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, దీని ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు పెరుగుతాయన్నారు. స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకుంటే తక్కువ ఖర్చుతో పోషణ మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు కూడా పిల్లల పోషణపై అవగాహన కలిగించడమే లక్ష్యమని నరసింహారావు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాము తయారు చేసిన ఆహార పదార్థాల వివరాలను పాఠశాల కమిటీ చైర్మన్ ప్రేమ లతకు, అలాగే తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీలత, సువార్త, పద్మజ, మమత, సి.ఆర్.పీ మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :