ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో నివాసం ఉండే గొటికె శాంతయ్యకు ఇద్దరు కూతుళ్లు తోపాటు కుమారుడు సంతానం ఉండగా పెద్ద కూతురుకి వివాహంజరిగింది. చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న చిన్న కూతురు స్వప్న (34) కు వివాహంకాలేదు. శాంతయ్య మృతి అనంతరం అతని పేరు మీద ఉన్న 10 ఎకరాల భూమిని భార్య వెంకటమ్మ పేరిట రిజిస్ట్రేషన్ చేయగా, అందులో 6 ఎకరాలు తన కొడుకు రాజు పేరిట చేసి 4 ఎకరాలు తన పేరు మీద ఉంచుకున్న వెంకటమ్మసంవత్సరం క్రితం స్వప్నకు తెలియకుండా తన తల్లి పేరు మీద ఉన్న 4 ఎకరాల భూమిని తన పేరు మీద చేసుకున్న తన అన్న రాజు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 4 ఎకరాల భూమిని తిరిగి తల్లి పేరిట స్వప్న రిజిస్ట్రేషన్ చేయించింది. ఈ క్రమంలో తల్లితో పొలం వద్ద సర్వే చేయిస్తుండగా కొందరు వ్యక్తులతో పొలం వద్దకు వచ్చి స్వప్నపై కత్తితో దాడి చేసి, ఆమె గొంతు కోసి రాజు పారిపోయాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే స్వప్న మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు నిర్ధారించారు. గత నెల తన స్కూటీకి ప్రమాదం జరగగా, స్వప్న కాలు విరిగింది. తన అన్నే తనపై దాడి చేయించాడని స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది.భూ తగాదాల్లో స్వప్న వేధింపులు ఎక్కువ అవుతున్నాయని, తనపై హత్యాయత్నం కేసు పెట్టిందని రాజు కొద్ది రోజులుగా తమతో చర్చించినట్లు అతని స్నేహితులు తెలిపినట్లు సమాచారం. స్వప్నను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు తోటి న్యాయవాదులు నిరసనచేపట్టారు.
Admin
E Nivas News