Thursday, 30 July 2026 01:11:29 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి...

మున్సిపల్ చైర్‌ పర్సన్ ఆకాష్...

Date : 29 March 2026 12:50 AM Views : 112

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పట్టణ ప్రజలు తమ ఇంటి పన్ను, నీటి పన్ను మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను సకాలంలో చెల్లించి ఆసిఫాబాద్ పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్‌ పర్సన్ ఆకాష్ కోరారు. శనివారం ఆసిఫాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 16వ వార్డులో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌లో ఆయన వైస్ చైర్ పర్సన్ ఎండి అహ్మద్, కమిషనర్ గజానంద్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్‌ పర్సన్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని, ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తను మహిళలు తడి, పొడి మరియు హానికర వ్యర్థాలుగా వేరు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్దే హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ​వైస్ చైర్‌ పర్సన్ ఎండి అహ్మద్ మాట్లాడుతూ దోమల నివారణకు వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి మందు స్ప్రే చేయిస్తున్నామని, ప్రజలు తమ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులలో ప్రస్తుతం పన్నుల వసూలు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, బకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించి మున్సిపల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 16 వ వార్డు కౌన్సిలర్ దూడల లక్ష్మి, బీఆర్ఎస్ నాయకుడు దూడల అశోక్, మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: