Friday, 19 June 2026 01:30:28 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

పాత మొబైల్ ఫోన్లతో సైబర్ మోసాలు ఇద్దరు అరెస్ట్..! పాత మొబైల్ ఫోన్లు పట్లజాగ్రత్తలు పాటించాలి

ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి

Date : 22 February 2026 02:39 PM Views : 121

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ రూరల్ పరిధిలోని రాంపూర్ ఎక్స్ రోడ్ వద్ద పాత కీప్యాడ్ మొబైల్ ఫోన్లు సేకరిస్తూ, వాటి ద్వారా భారీ ఎత్తున సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. నిందితులు పాత మొబైల్ ఫోన్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిలోని డేటా, సిమ్ కార్డులు, ఐఎంఈఐ నంబర్లు సేకరించి, బ్యాంకు అధికారులు లేదా కస్టమర్ కేర్ ప్రతినిధులుగా నటిస్తూ అమాయక ప్రజలను ఓటిపి లు అడిగి మోసం చేసి వారి ఖాతాల నుండి డబ్బులు దోచుకునేవారని విచారణలో వెల్లడైం దన్నారు. స్క్రాప్ మొబైల్ భాగాలను హైదరాబాద్‌లో విక్రయిస్తూ లాభం పొందుతున్నట్లు నిందితులు అంగీకరించినట్టు తెలిపారు. పోలీసులు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు యాక్టివా స్కూటీ - 1, రెండు స్మార్ట్ ఫోన్లు, 20 కీప్యాడ్ మొబైల్ ఫోన్లు, 38 మొబైల్ బ్యాటరీలు, మొబైల్ విడిభాగాలు జప్తు చేశామన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుల మొహమ్మద్ ఆసిఫ్, అజామ్ ఖురేషి ఉత్తరప్రదేశ్ కు చెందిన వారన్నారు. ప్రజలు పాత మొబైల్ ఫోన్లు విక్రయించే ముందు జాగ్రత్తలు పాటించాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిఎస్పీ సూచించారు. సైబర్ నేరాలపై వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. పాత మొబైల్ ఫోన్లను అమ్మే ముందు యజమానులు జాగ్రత్తలు పాటించాలని గుర్తుతెలియని వాళ్ళకి అమ్మ వద్దని తెలిపారు. అదే విధంగా మొబైల్ షాప్ యజమానులు మొబైల్ ను కొనుగోలు చేసే ముందు యజమానుల ధ్రువపత్రాలను మరియు సరైన బిల్లులను సరిచూసుకొని పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: