ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు, లారీల ద్వారా ధాన్యం రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం, ఇబ్బందులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీరామ రైస్ మిల్లును మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ తనిఖీలో లక్షెట్టిపేట ఎమ్మార్వో, మంచిర్యాల ఏసీపీఆర్. ప్రకాష్, లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు విధానం, లారీల ద్వారా ధాన్యం రవాణా ప్రక్రియను అధికారులు పరిశీలించారు. ధాన్యం లోడింగ్ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రైస్ మిల్ యాజమాన్యానికి సూచించారు. రైతులకు,లారీ లోడింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేదా జాప్యాలు లేకుండా సకాలంలో సేవలు అందిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులు రైస్ మిల్ నిర్వాహకులకు సూచించారు.
Admin
E Nivas News