ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శ్రీ శక్తి చీరలను ఆదివారం మునిసిపాలిటీతో పాటు మండలంలో కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. మండలంలోని వెంకటరావుపేట తో పాటు పట్టణంలోని స్థానిక శ్రీ సాయి ప్రగతి మండల సమాఖ్య కార్యాలయంలో ఆదివారం ఇందిర మహిళా శక్తి చీరలను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని వివరించారు. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే నినాదం తో ముందుకు వెళుతున్నామని తెలిపారు. అంతకుముందు తహసీల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ మండలానికి మొత్తం 7160 చీరలు వచ్చాయని తెలిపారు. వీటిలో 6840 చీరలు 6.30 మీటర్లు, 320 చీరలు 9 మీటర్ల పొడవు ఉన్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో పంపిణీ కార్యక్రమం పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంకతి శ్రీనివాస్, ఆరీఫ్, పింగళి రమేష్, సుమన్ రవీందర్, ఏ పీ ఏం భూమక్క, సీసీ లు లచ్చన్న, సురేందర్, వసంత లక్ష్మీ, జనార్దన్, సుమలత, విఓ లు, సభ్యులు పాల్గొన్నారు.
Admin
E Nivas News