Saturday, 01 August 2026 07:39:23 AM
# పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నిత్య సమాజ సేవకుడు & రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల సలాం # బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత... # ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు # చోరీ కేసు లో ఇంటి పనివాడే దొంగగా మారాడు.. # బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు..! అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లపై కఠిన చర్యలు.. # జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. # దొంగతనం కేసులో శంకర్ లాల్ కు సహకరించిన మహిళ అరెస్టు... # పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి... # అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల పోస్టర్ విడుదల... # ఆగస్టు-3 నుండి పాములపాడు గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభం # రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు - ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కలేదు–రైతు కురువ ఎల్లయ్య ఆవేదన # మంత్రి టీజీ.భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ లను ఘనంగా సన్మానం చేసిన లీగల్ సెల్ జి.నాగముని, జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, చంద్రుడు # నందికొట్కూరు పట్టణంలోని, 16వ వార్డులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం...

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి...! సంక్షేమం–అభివృద్ధి సమన్వయంతో తెలంగాణ ముందుకు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Date : 03 February 2026 10:54 PM Views : 151

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మున్సిపల్, మేయర్ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. ప్రజలకు, ముఖ్యంగా నగర ప్రాంతాల్లోని పౌరులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండు సంవత్సరాలుగా పట్టణ పాలన, అర్బన్ ప్లానింగ్ రంగాల్లో సమగ్ర ప్రణాళికలతో మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. నగరాల మౌలికసదుపాయాల అభివృద్ధితో పాటు పేదలు, మధ్యతరగతి, బడుగు–బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తుందన్నారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేసి, ప్రతి వ్యక్తికి 6 కేజీల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణీచేస్తున్నా మనీ తెలిపారు.రాష్ట్రంలో మొత్తం 1 కోటి 15 లక్షల కుటుంబాలు ఉండగా, దాదాపు 1 కోటి 3 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. మార్కెట్‌లో కిలోకు రూ.50 నుంచి రూ.55 ధర ఉన్న బియ్యాన్ని ఉచితంగా అందించడం ద్వారా కోట్లాది కుటుంబాలకు ప్రభుత్వమే భరోసాగా నిలిచిం దన్నారు. 200 యూనిట్ల లోపు వినియోగించే పేద, బలహీన, అల్పాదాయ వర్గాల కుటుంబాలకు ఉచిత విద్యుత్ సరఫరా. బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా విద్యుత్ శాఖకు చెల్లిస్తోం దన్నారు. మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం, దీని ద్వారా వారి జీవనోపాధి ఖర్చులు గణనీయంగా తగ్గాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకే కాకుండా, పట్టణాల్లోని మహిళలు కూడా ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. మున్సిపాలిటీల్లో మహిళల కోసం దాదాపు రూ.6,000 కోట్ల మేర వడ్డీలేని రుణాలు మంజూరు చేసి, వాటి వడ్డీ భారం కూడా ప్రభుత్వమే భరిస్తోం దన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌కే పరిమితం కాకుండా అన్ని మున్సిపాలిటీల్లో, శాసనసభ నియోజకవర్గ కేంద్రాల వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ & స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.విద్య ఉన్నా నైపుణ్యాల లేమితో ఉద్యోగాలు దొరకని పరిస్థితిని మార్చడమే లక్ష్యంగా ఈ కేంద్రాలు పనిచేస్తాయి. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్కూల్స్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నా మన్నారు. సంక్షేమంతో పాటు పరిశ్రమలు, మౌలిక వసతులు, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రంలో పెరుగుతున్న అర్బనైజేషన్‌ను దృష్టిలో పెట్టుకుని కోర్–పెరి అర్బన్–రీజినల్–రూరల్ ఎకానమీ అనే మూడు దశల విధానంతో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు చేస్తున్నాం. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా మిగతా మున్సిపాలిటీల పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల క్లస్టర్లు ఏర్పాటు చేసి, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ద్వారా విలువ జోడించిన ఉత్పత్తులు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ భవిష్యత్ నిర్మాణం కోసం విజన్–2047 డాక్యుమెంట్‌ను విడుదల చేశాం, రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఈ అభివృద్ధి పునాదులను బలపరచేందుకు ప్రజల ఆశీర్వాదం అత్యంత అవసరం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని పట్టణ ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి అలాగే ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీని ఒక కుటుంబంలా భావించి, కింది స్థాయి కార్యకర్తల నుంచి నాయకత్వం వరకు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: