ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : రీసర్వే ప్రాజెక్ట్ లో భాగంగా 6 వ విడతగా పాములపాడు మండలములో తహసిల్దార్ జి.సుభద్రమ్మ ఆధ్వర్యంలో భూముల రీ సర్వే నిమిత్తం ఎన్నిక కాబడిన పాములపాడు గ్రామంలోని, చౌడమ్మ గుడి వద్ద గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ జి.సుభద్రమ్మ మాట్లాడుతూ 03.08.2026 నుండి పాములపాడు గ్రామం నందు రీ సర్వే మొదలవుతుందనీ అన్నారు. పాములపాడు గ్రామంలో భూములు కలిగిన గ్రామ రైతులు తమ ఆధారాలు తీసుకొని అందుబాటులో ఉండి సహకరించవలసినదిగా కోరారు. అనంతరం గ్రామంలో భూముల రీ సర్వే కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ అఫ్ సర్వే, పి.శ్రీనివాసులు, మండల సర్వేయర్ కలిముల్లా, గ్రామ వీఆర్వో శివన్న, గ్రామ సర్వేయర్, శ్రీదేవి, వీఆర్ఏలు టి.లింగస్వామి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Admin
E Nivas News