Saturday, 01 August 2026 08:34:06 AM
# పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నిత్య సమాజ సేవకుడు & రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల సలాం # బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత... # ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు # చోరీ కేసు లో ఇంటి పనివాడే దొంగగా మారాడు.. # బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు..! అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లపై కఠిన చర్యలు.. # జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. # దొంగతనం కేసులో శంకర్ లాల్ కు సహకరించిన మహిళ అరెస్టు... # పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి... # అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల పోస్టర్ విడుదల... # ఆగస్టు-3 నుండి పాములపాడు గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభం # రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు - ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కలేదు–రైతు కురువ ఎల్లయ్య ఆవేదన # మంత్రి టీజీ.భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ లను ఘనంగా సన్మానం చేసిన లీగల్ సెల్ జి.నాగముని, జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, చంద్రుడు # నందికొట్కూరు పట్టణంలోని, 16వ వార్డులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం...

రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు - ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కలేదు–రైతు కురువ ఎల్లయ్య ఆవేదన

Date : 31 July 2026 08:53 PM Views : 49

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లాలోని, పాములపాడు గ్రామానికి చెందిన రైతు కురువ ఎల్లయ్య మాట్లాడుతూ, తమ కుటుంబానికి చెందిన సర్వే నెం. 261లో 21 ఎకరాల 64 సెంట్ల భూమి మాత్రమే ఉండగా, రెవెన్యూ రికార్డుల్లో 25 ఎకరాల 14 సెంట్లు ఉన్నట్లు నమోదు చేశారని తెలిపారు. అంతే కాకుండా, అదే సర్వే నంబర్‌లో 4 ఎకరాల 50 సెంట్ల భూమిని ఇతరుల పేర్లపై నమోదు చేసి ఆన్‌లైన్ పట్టాదారు పాస్‌బుక్కులు జారీ చేయడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, సర్వే నెం. 43/3లో 50 సెంట్ల భూమిని కొనుగోలు చేయగా, నేషనల్ హైవే రోడ్డులో 31 సెంట్లు భూసేకరణకు పోగా, మిగిలిన 19 సెంట్లు మాత్రమే ఉండాలి, కానీ రెవెన్యూ రికార్డుల్లో 29 సెంట్లు ఉన్నట్లు చూపిస్తున్నారన్నారు. ఈ కారణంగా ఆత్మకూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ కూడా జరగడం లేదని తెలిపారు. ఈ రెండు సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో ద్వారా ఫిర్యాదులు అందజేసినా, గత ఒక సంవత్సరం కాలంగా గ్రామ విఆర్ఓ, తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి పరిష్కారం లభించలేదని అన్నారు. సమస్యకు సంబంధించిన అన్ని సరైన డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఆధారాలు అధికారులకు పలుమార్లు చూపించినప్పటికీ సమస్యను పరిష్కరించడం లేదు. ప్రతి సారి కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న కానీ, సమస్య పరిష్కారం కాకపోగా ప్రయాణ ఖర్చులు పెరుగుతున్నాయనీ అన్నారు. సమయం వృథా కూడా వృధా అవుతోందనీ అన్నారు. అయినప్పటికీ తమ సమస్యను అధికారులు అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదన్నారు. అసలు సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదో కూడా తమకు తెలియడం లేదని కురువ ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న ఈ తప్పులను వెంటనే సరిచేసి, బాధ్యులపై విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను, రెవెన్యూ ఉన్నతాధికారులను రైతు కురువ ఎల్లయ్య విజ్ఞప్తి చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: