ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / హైదరాబాద్ : రాష్ట్ర ఐటి & విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ని హైదరాబాదులోని, ఆయన స్వగృహం నందు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర.శివానందరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, నియోజవర్గ సమస్యలపై, జిల్లాలోని సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మాండ్ర.శివానందరెడ్డి మంత్రి నారా లోకేష్ బాబుతో మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలోని, ప్రభుత్వ పాఠాశాలను మోడల్ స్కూల్ తరహాలో అభివృద్ధి పరచి ప్రభుత్వ పాఠాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు చేపట్టాలని, అలాగే తంగడంచ సీడ్ పార్కును అభివృద్ధి చేయాలని, మిడ్తూరు, తదితర ఎత్తిపోతల పథకాల ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది. దీనిపై మంత్రివర్యులు సానుకూలంగా స్పందించడం జరిగిందని మాండ్ర శివానందరెడ్డి తెలిపారు.
Admin
E Nivas News