ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, జిల్లా విద్య మౌలిక సంక్షేమ కార్యాలయంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిథులుగా ఏపీఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని, డైరెక్టర్ ఎన్.రాఘవేంద్ర పాల్గొన్నారు. భారతదేశం ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన, ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యొక్క కృషితో ఈరోజు గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. దేశానికి గణతంత్ర దినోత్సవం వచ్చిన తర్వాత మన దేశం అన్ని రంగాలలో ముందుకు వెళ్లిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, డైరెక్టర్ ఎన్.రాఘవేంద్ర, కర్నూలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగిరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పూర్ణచంద్రరావు , వెంగన్న సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిబ్బంది, స్టేట్ డైరెక్టర్ సన్నిహితులు, న్యాయవాదులు బి.చిన్నయ్య, ఎన్.నవీన్ కుమార్, మాధవ కృష్ణ ప్రసాద్, ఏఎస్ఐ- యేసు రత్నం, లాజర్, మద్దయ్య, ప్రభుదాస్, స్టాలిన్,డోన్ రఘు, తిరుమలేశు, బాలస్వామి, వెంకీ, సాయి చక్రవర్తి, ఏం.సుధాకర్, మేకల అయ్య స్వామి లు వేడుకలో పాల్గొని, ఘనంగా నిర్వహించారు.
Admin
E Nivas News