Friday, 31 July 2026 06:16:28 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సహకార స్ఫూర్తితో కొండ‌ప‌ల్లి బొమ్మ‌కు స‌రికొత్త శోభ‌

ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

Date : 08 February 2026 08:12 AM Views : 99

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల క‌ళాకారుల జీవితాల‌ను ఉన్న‌తంగా తీర్చిదిద్ద‌డంతో పాటు ఈ క‌ళ‌ను త‌ర‌తరాల‌కు వార‌స‌త్వ సంప‌ద‌గా అందించేందుకు కృషి చేస్తున్నామ‌ని ఇదేవిధంగా క‌ళాకారులు కూడా స‌హ‌కార స్ఫూర్తితో ఐక్యంగా అడుగులు వేసి క‌ళ‌ను మ‌రింత విశ్వ‌వ్యాప్తం చేయ‌డంలో భాగ‌స్వాములు కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ శ‌నివారం కొండ‌ప‌ల్లి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌లో హ‌స్త‌క‌ళాకారుల స‌హ‌కార సంఘాల ప్ర‌తినిధులతో స‌మావేశ‌మ‌య్యారు. శ‌తాబ్దాల చారిత్ర‌క ఔన్న‌త్యమున్న కొండ‌ప‌ల్లి బొమ్మ‌కు మ‌రింత ప్రాచుర్యం తెచ్చేందుకు చేయీచేయీ క‌ల‌పాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని క‌ళాకారులు ఐక్యంగా ముంద‌డుగు వేస్తే క‌ళ‌కు మ‌రింత వైభ‌వం వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. ఇందుకు క‌ళాకారులు ముందుకొచ్చారు. ప్ర‌భుత్వ కృషిని స‌ద్వినియోగం చేసుకుంటూ క‌ళ‌కు కొత్త జీవం తెస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క రంగానికి అత్యంత ప్రాధాన్య‌మిస్తోంద‌ని, ప్ర‌భుత్వ కృషిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. కొండపల్లి బొమ్మలు కేవలం కళాకృతులు మాత్రమే కాద‌ని మ‌న ఘ‌న సాంస్కృతిక వార‌స‌త్వ సంప‌ద‌కు ప్ర‌తీక‌ల‌ని, సామూహిక శక్తితో ఆర్థిక స్థిరత్వం త‌ద్వారా క‌ళ వైభ‌వ వ్యాప్తి విస్తృత‌మ‌వుతుంద‌న్నారు. కొత్త డిజైన్ల‌కు సంబంధించి కూడా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం జరుగుతుంద‌న్నారు. రాష్ట్రంతో పాటు దేశ, విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పేలా, భ‌విష్య‌త్తు త‌రాల‌కు వార‌స‌త్వ సంప‌ద‌గా అందించేందుకు ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ అభివృద్ధితో పాటు కొండపల్లిని ఒక మోడ‌ల్ గ్రామీణ సృజనాత్మక ఆర్థిక కేంద్రంగా మార్చడానికి చొర‌వ‌చూపుతున్నామ‌న్నారు. కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు, మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌, బ్రాండింగ్, ఎస్‌హెచ్‌జీ వ్య‌వ‌స్థాప‌క‌త వంటి వాటికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, గ్రామీణ క‌ళాత్మ‌క ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేత‌మవుతుంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వివ‌రించారు. ఈ స‌మావేశంలో జిల్లా ప‌ర్యాట‌క అధికారి ఎ.శిల్ప‌, కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల క‌ళాకారుల సంఘాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :