Friday, 31 July 2026 01:48:52 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సేంద్రియ సాగుతో డ‌బుల్ ధ‌మాకా..! ఉద్యాన ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి

ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 13 February 2026 08:09 AM Views : 184

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్ టి ఆర్ జిల్లా/రెడ్డిగూడెం : వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతులను అవలంబించడం ద్వారా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు 'డబుల్ ధమాకా' లాంటి మేలు జరుగుతుందని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. గురువారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తిరువూరు ఆర్‌డీవో కె.మాధురితో కలిసి రెడ్డిగూడెం మండలంలోని, రంగాపురం గ్రామంలో పర్యటించి, మామిడి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు ఉత్ప‌త్తిదారుల సంస్థ‌ల (ఎఫ్‌పీవో) అభ్యుద‌య రైతుల‌తో మాట్లాడి ఫ్రూట్ క‌వ‌ర్ల వినియోగం, ప్ర‌యోజ‌నాల‌ను అడిగి తెలుసుకున్నారు. స్వ‌యంగా మామిడి కాయ‌ల‌కు ఫ్రూట్ క‌వ‌ర్లు వేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ మామిడి రైతుల సంక్షేమానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని.. ఉద్యాన ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఫ్రూట్ క‌వ‌ర్లు వ‌ల్ల ఎలాంటి మచ్చ లేని, మంచి రంగుతో ప‌రిమాణంలో మామిడి దిగుబ‌డి ఉంటుంద‌న్నారు. హెక్టారుకు 15 వేల క‌వ‌ర్ల‌ను 50 శాతం రాయితీతో ప్ర‌భుత్వం అందిస్తోంద‌న్నారు. ఇలాంటి మామిడికి మార్కెట్లో మంచి రేటు ఉంటుంద‌ని, వినియోగ‌దారుల‌కు కూడా మంచి నాణ్య‌మైన ఆరోగ్య‌క‌ర పండ్లు ల‌భిస్తాయ‌న్నారు. నిమ్మ‌కాయ సైజులో కాయ ఉన్న‌ప్పుడు క‌వ‌ర్ కట్టడం వల్ల పండ్ల ఈగలు, ఇతర కీటకాలు కాయను ఆశించలేవ‌ని.. దీనివల్ల రైతుకు పురుగుమందుల ఖర్చు బాగా త‌గ్గుతుంద‌ని, రసాయన అవశేషాలు లేని పండ్లు ఉత్ప‌త్తి అవుతాయ‌ని వివ‌రించారు. మామిడి రైతులు కూడా 100 శాతం ప్ర‌కృతి సేద్య విధానాల‌ను అనుస‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. జిల్లా అధికార యంత్రాంగం కృషితో ప్ర‌భుత్వం మామిడి సేక‌ర‌ణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు మామిడి రైతులు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. మామిడి రైతుల‌కు ఇబ్బంది క‌లిగిస్తున్న కోడి పేనుపై దృష్టిసారిస్తున్నామ‌ని, శాస్త్ర‌వేత్త‌ల స‌హ‌కారంతో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :