Friday, 31 July 2026 08:40:33 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహంపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాలి

ప్రజా సంఘాల నాయకులు

Date : 08 February 2026 09:06 PM Views : 147

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కరీంనగర్ జిల్లా, రామచంద్రాపురం మండలంలోని, తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహంపై దాడి చేసిన మనువాద దుండగులను అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. కర్నూలు నందలి స్థానిక పూలే సర్కిల్ లో పూలే విగ్రహంపై దాడి సంఘటనను నిరసిస్తూ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ సంఘాల ప్రతినిధులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు నక్కలమిట్ట శ్రీనివాసులు, శేషఫణి, నంది విజయలక్ష్మీ, ఖధీరుల్లా, కెవిపిఎస్ ఆనందబాబు బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు భరత్ కుమార్ ఆచారి, ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఇక వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, బిసి సంఘం నాయకుడు నక్కలమిట్ట. శ్రీనివాసులు లు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పూలే విగ్రహాన్ని కూలగొడుతూ కాళ్ళతో తన్ని అవమానించడం జరిగిన సంఘటన బహుజనుల ఆత్మగౌరవానికి సంబంధించినది అని వారి మనోభావాలను కించపర్చడమే అని వారు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను తొక్కి పెడితే , మహాత్మా జ్యోతిరావు పూలే, శివాజీ మహారాజ్ చరిత్రను వెలికి తీసి, మొట్టమొదటి సారిగా శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించినది మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పిన వాస్తవ చరిత్రను తెలుసుకోకుండా మహాత్మా జ్యోతిరావు పూలే పై దాడి చేయడం సిగ్గుచేటు అని వారు అన్నారు. పూలే గారి విగ్రహంపై దాడి చేసి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల వర్గాలను అవమానించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మనువాదుల పై చట్టపరమైన చర్యలు చేపట్టి తక్షణమే అరెస్టు చేయాలని లేని పక్షంలో ఛలో తెల్లాపూర్ కు బహుజనులు పిలుపునిచ్చి తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమాచారం హక్కు చట్టం ప్రతినిధి జయన్న, బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం నాయకులు చిరంజీవి, పెరికల రంగస్వామి, కాంగ్రెస్ నాయకులు మల్లిఖార్జున, కంది వరుణ్ కుమార్, సత్యనారాయణ మరియు బిఎస్పీ నాయకులు అరుణ్ కుమార్, రాజ్ కుమార్, మహిళా ఐక్య వేదిక నాయకులు వగ్గ ఈరమ్మ , కటికె భాను, పద్మావతి, ఎలీసమ్మ , కొమ్ము పెద్దక్క, అమీనాబీ, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :