Friday, 31 July 2026 01:37:32 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నందికొట్కూరులో హోరెత్తిన ప్రజా గళం.. స్తంభించిన ట్రాఫిక్..!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై చలో పటేల్ సెంటర్

Date : 13 February 2026 07:56 AM Views : 125

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాలను నిరసిస్తూ, కిసాన్ మోర్చా పిలుపుమేరకు నందికొట్కూరు పట్టణంలో కార్మిక, రైతు లోకం సమరశంఖం పూరించింది. గురువారం ఉదయం నందికొట్కూరు పట్టణంలోని పాత బస్టాండ్ నుండి పటేల్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దాదాపు గంటపాటు రహదారిని దిగ్బంధించడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు మజీద్ మీయా అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై. నరసింహులు, అఖిల భారత కిసాన్ మహాసభ నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరుణ్ కుమార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు మజీద్ మియా, ఐ కెఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.నరసింహులు, అఖిలభారత కిసాన్ మహాసభ నాయకులు పిక్కిలి.వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి అరుణ్ కుమార్ లు మాట్లాడుతూ చారిత్రక పోరాటాల ద్వారా సాధించుకున్న 8 గంటల పని దినాన్ని కాలరాస్తూ, కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను 4 లేబర్ కోడ్‌లుగా కుదించి కార్మికులను బానిసలుగా మార్చాలని చూస్తోంది అని మండిపడ్డారు. రాష్ట్రంలోని తెలుగుదేశం-జనసేన కూటమి ప్రభుత్వం కూడా దీనికి వత్తాసు పలుకుతూ 10 గంటల పని దినాన్ని అమలు చేయాలని చూడటం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. స్కీమ్ వర్కర్లైన అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను పర్మినెంట్ చేయాలి. కనీస వేతనం రూ. 30,000/- అమలు చేయాలన్నారు. విబి రాంజీ పథకాన్ని రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించాలి. ఏటా 200 రోజుల పని, రోజుకు రూ.700/- వేతనం కల్పించాలన్నారు. భవన నిర్మాణ మరియు ఆటో కార్మికుల కోసం తక్షణమే సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.రైతుల రుణాలు తక్షణమే మాఫీ చేయాలి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానాలను రద్దు చేసి ఎన్నికల హామీలను నెరవేర్చాలన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో భాగస్వాములవుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ మొండి వైఖరిని వీడకపోతే వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరో విప్లవాత్మక ఉద్యమాన్ని నిర్మిస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు రమణయ్య శెట్టి, ఎల్లా నాయుడు, పుల్లన్న, శివ, ఐఎఫ్టీయూ నాయకులు తిక్కయ్య, మున్సిపల్ వర్కర్స్ నాయకులు గోవిందు, శేఖర్, అశోక్ బాలాజీ. పీఓడబ్ల్యూ నాయకురాలు చూరిబీ, రమణమ్మ, ఎస్.బీబీ, ఏఐసీసీటీయూ నాయకులు. లింగాల శ్రీనివాసులు సామన్న, షేక్షావలి, ఏఐకేఎం నాయకులు ఏసన్న, సుధాకర్, యేసురత్నం తదితరులతో పాటు వందలాది మంది హమాలీ, ఆటో, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: