Thursday, 30 July 2026 11:31:47 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

అడవి పందుల వలన నష్టపోయిన రైతులకు చెక్కులను పంపిణీ చేసిన ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రణీత భాయి

Date : 06 February 2026 09:27 PM Views : 214

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని గ్రామాల్లో ఉన్న రైతుల మొక్కజొన్న పంటలపై అడవి పందుల దాడిలో నష్టపోయిన మొక్కజొన్న రైతులకు ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రణీత భాయి నష్టపరిహారం చెక్ లను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రణీతాబాయి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రైతులు తమ వ్యవసాయ పొలాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేసుకుంటున్న తరుణంలో అడవి పందుల బెడద నుంచి నష్టపోయిన మొక్కజొన్న రైతులకు ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో చెక్ లను అందజేయడం జరిగిందన్నారు. కొత్తపల్లి మండలంలోని, పెద్ద గుమ్మడాపురం, చిన్న గుమ్మడాపురం రైతులకు 54 మందికి పరిహారం చెక్ లు మంజూరు అయ్యాయన్నారు. ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ఒక ఎకరా కు 10 వేల వరకు నష్టపరిహారం అందజేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో రైతు పంట ఎంత మేరకు నష్టం జరిగింది పరిశీలించి నష్టాన్ని అంచనా వేసిన తర్వాతే పరిహారం మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే నల్లమల్ల అడవులకు సమీపంలో ఉన్న రైతులందరూ తమ పంట పొలాలు వేసిన సమయంలో అడవి జంతువులకు ఎలాంటి హాని కలిగించరాదన్నారు. పంటలను నాశనం చేయకుండా అడవి జంతువులను శబ్దాలతో బెదిరించాలి తప్ప హాని చేస్తే చట్ట పరమైన చర్యలు ఉంటాయని రైతులకు సూచించారు. ఈ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మద్దిలేటి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లు సలాముల్ల, పాములేటి, రైతులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: