Friday, 31 July 2026 10:45:42 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మాండ్ర.శివానంద రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సింగపూర్ టేకూరి.నాగేష్, మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ

Date : 19 July 2026 05:27 PM Views : 109

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి కి సింగపూర్ దేశం నుండి పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత డాక్టర్ టేకురి నాగేశ్వరరావు, ఆయన తల్లి వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, నాయకులు, కార్యకర్తలతో కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. అనంతరం మాండ్రశివానందరెడ్డి పుట్టినరోజు సందర్భంగా, వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ ఆధ్వర్యంలో భారీ కేక్ ను కటింగ్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు, వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి. రామసుబ్బమ్మ లు మాట్లాడుతూ మాండ్ర. శివానందరెడ్డి పోలీస్ శాఖలో సిన్సియార్టీగా విశేష సేవలు అందించి, అందరి మన్ననలు పొంది ఉన్నత స్థాయి అధికారిగా సేవ చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ ఇంచార్జిగా, మచ్చలేని నాయకుడిగా, అందరివాడిగా ఉండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేసి, అధికారంలోకి రావడానికి నిరంతరం పాటుపడడం జరిగిందన్నారు. ఆయన నందికొట్కూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడపడమే కాకుండా, జిల్లా అభివృద్ధికి కూడా కృషి చేయడం జరిగిందన్నారు. భగవంతుని అపార కృపాకటాక్షాలతో మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలు, అఖండ ఐశ్వర్యం, సుఖసంతోషాలు, విజయాలతో నిత్యం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామనీ అన్నారు. మీ నాయకత్వం, సేవాభావం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, ప్రజల ఆదరణతో ప్రజాసేవలో విశిష్ట విజయాలను సాధించాలని, భగవంతుడు మీకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, శక్తి ప్రసాదించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నామనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, నెంబర్ లక్ష్మన్న, ప్రసాద్, చిన్నస్వామి ఆచారి, టేకూరి భాస్కర్, బోనాల భాస్కర్, జీవన్న, ఆంథోనీ,జనార్ధన్ నాయక్, నారాయణ రెడ్డి, జనసేన శేషు, చిన్న హుసనయ్య, నారాయణ, సుబ్బారావు, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :