Friday, 31 July 2026 03:32:37 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

జూపాడుబంగ్లాలోని, ఏపీ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను ఆకస్మికగా తనిఖీ చేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 10 November 2025 11:20 PM Views : 255

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : మండల కేంద్రమైన జూపాడుబంగ్లాలోని, ఏపీ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా పాఠశాలలోని వంట గది, ఇతర గదులు మరియు పరిసరాల పరిశుభ్రతను, విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని, పాఠశాల పరిసరాలను, ముఖ్యంగా వంట గది అపరిశుభ్రంగా ఉండడాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై, వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. విద్యార్థుల సమస్యలను అడిగి తెసుకున్నారు. వారి సమస్యలను విని ఎమ్మెల్యే నివ్వెరపోయారు. ప్రిన్సిపాల్‌, హాస్టల్ వార్డెన్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు, సామర్థ్యానికి సరిపడా మధ్యాహ్న భోజనాలు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఏపీ మోడల్ స్కూల్ వసతి గృహానికి సంబంధించి నిర్వహణను పరిశీలించి, మంచిగా పెట్టుకోవాలని సూచించడం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా గతంలో జరిగిన ఒక సంఘటనపై ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కూల్‌ సౌకర్యాలపై అందిన ఫిర్యాదుల మేరకే ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. వసతి గృహ సంరక్షణపై జిల్లా ఉన్నతాధికారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసి, మరల ఇటువంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య తెలియజేశారు. పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దని అన్నారు. వేగవంతంగా వారి సమస్యల పరిష్కార దిశగా సిబ్బంది అడుగులు వేయాలని, లేకుంటే ఉపేక్షించే లేదని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మండల కన్వీనర్ పలచాని. మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ.రవీంద్ర, మాండ్ర. శివానందరెడ్డి పిఏ- మద్దిలేటి, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :