ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం ఆవరణలో మరియు ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో యుహెచ్డీ ప్లాంటేషన్ కార్యక్రమం అనగా అనంత అరణ్య ప్లాంటేషన్ కి సంబంధించి ఫిట్టింగ్ చేయించడం జరిగింది. ఈరోజు అక్కడ జరుగుతున్న విబిజి రామ్ జీ పథకంలోని, పనులకు సంబంధించి మైనర్ కెనాల్ లో పనిచేస్తున్న శ్రామికుల మస్టర్ లను, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆవరణలో మరియు ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో జరుగుతున్న ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ట్రైని క్లస్టర్ కో ఆర్డినేటర్ వీరన్న, క్లస్టర్ ఏపీడి- వెంకట్రామిరెడ్డి, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, నెట్ జీ సంస్థ ఎన్జీవో రాజశేఖర్ లు తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును తొలగించి జులై-1వ తేదీన వికసిత్ భారత్ విబిజి రామ్ జీ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకంలో శ్రామికులకు ఒక కుటుంబానికి 125 రోజుల పని కల్పించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రతి వర్క్ లో కొలతల ప్రకారమే శ్రామికులు పనిచేయాలని, ఆ ప్రకారమే కూలీలు వేయడం జరుగుతుందని అన్నారు. పని చూపించమని అడిగిన ప్రతి వారికి పనులు కల్పించడం జరుగుతుందన్నారు.
ఎవరు కూడా ఇటువంటి పనులు లేవని ఇతర ప్రాంతాలకు వలసలు పోవలసిన అవసరం లేదన్నారు. డిమాండ్ ఇచ్చిన 15 రోజుల లోపల పని తప్పక కల్పించడం జరుగుతుందన్నారు. వారితోపాటు ఏపీవో- బి.జయంతి, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ప్రిన్సిపాల్ ఎం.రాజ్యలక్ష్మి, టిఏ- స్వాములు, ఫీల్డ్ అసిస్టెంట్- లింగస్వామి, మేట్స్ కలబండి. నాగరాజు, బొల్లెద్దుల.మోహన్, శ్రామికులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News