Thursday, 30 July 2026 06:31:09 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అనగారిన వర్గాలకు అండ- ఎంఆర్పిఎస్ జెండా

మిట్టకందాలలో ఘనంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

Date : 07 July 2026 10:40 PM Views : 65

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా ఇంచార్జ్ డాక్టర్ మున్నంగి నాగరాజు సలహాల మేరకు పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో జెండా పండుగ మరియు కృష్ణ మాదిగ పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రాంప్రసాద్ మాదిగ, ఎంఎస్పి మండల అధ్యక్షులు బి.మోహన్, ఎంఎస్ పి మండల ఉపాధ్యక్షుడు లింగాల. సురేష్ మాదిగల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ప్రేమ్ రాజు మాదిగ, నందికొట్కూరు నియోజకవర్గం బిజెపి సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ. నాయకులు బుద్ధనగర్ నాగేశ్వరరావు పాల్గొని, కృష్ణ మాదిగ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తే భవిష్యత్తులో రాజ్యాధికారం మాదిగల సొంతమవుతుందని వారుకొనియాడారు. మందకృష్ణ మాదిగ ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకోవడం జరిగింది. వికలాంగులు, వితంతువులు, అణగారిన వర్గాలకు మూడు కిలోల నుంచి ఐదు కిలోలలకు రేషన్ బియ్యం. పెంచిన ఉద్యమ చరిత్ర ఎమ్మార్పీఎస్ కె ఉందని నాయకులు గుర్తు చేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాదిగలకు ఇచ్చిన 6, 5 ను రిజర్వేషన్ ఫలాలను. అందిపుచ్చుకోవాలని, ప్రతి మాదిగ బిడ్డ చదువుకోవాలని మధ్యలో ఆపేసిన వారు ఎవరైనా ఉంటే ఎమ్మార్పీఎస్ కృష్ణ మాదిగ అండగా ఉంటారని తెలియజేశారు.

ఇదే క్రమంలో సామాజిక ఆర్థిక విద్య, వైద్య రంగాలలో మాదిగలు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే జాతి గర్వపడుతుందని, అణగారిన వర్గాలకు.న్యాయం చేసే విధంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఉండాలని మందకృష్ణ మాదిగ పిలుపునివ్వడంతో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అన్యాయం జరిగితే ముందుగా స్పందించేది ఎమ్మార్పీఎస్ అని గుర్తు చేశారు. అలాగే దళిత ఉద్యోగులను ఇబ్బంది పెడితే ఎమ్మార్పీఎస్ చూస్తూ ఊరుకోదని, నిజాయితీగల అన్ని వర్గాల ఉద్యోగులను ఇబ్బందికి గురి చేయకుండా ఉన్నతాధికారులు మసులుకోవాలని .గుర్తు చేస్తున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు అమర్, కళ్యాణ్, ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్, మద్దూరు అజయ్, అశోక్ కుమార్, రామసముద్రం, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, తిరుపాల్, రూకల సుధాకర్, జకరయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు శివ రాముడు, శ్రీనివాసులు, రాజేష్, లింగాల యోహాను మరియు గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :