ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : పోలీసు శాఖలో అంకితభావంతో పనిచేస్తూ, నేర నియంత్రణలో తనదైన ముద్ర వేసిన ఆత్మకూరు ఎస్సై డి.వి. నారాయణరెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ సేవా పురస్కారం రావడం జరిగింది. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ లు ఆయనకు ఈ ప్రశంసా పత్రాన్ని ఎస్సై డివి.నారాయణరెడ్డి కి ప్రధానం చేయడం జరిగింది. *నేరగాళ్లపై ఉక్కుపాదం.. బాధితులకు న్యాయం* ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి నారాయణరెడ్డి తీసుకున్న చర్యలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇన్వెస్టిగేషన్ స్కిల్స్:* క్లిష్టమైన కేసులను ఛేదించడంలో, దర్యాప్తులో శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ నేరస్థులకు శిక్ష పడేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పెండింగ్ కేసులు: స్టేషన్ పరిధిలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించి రికార్డులను క్లియర్ చేశారు. *పబ్లిక్ రిలేషన్స్- 'ఫ్రెండ్లీ పోలీసింగ్* నేరస్థులకు సింహస్వప్నంగా మారుతూనే, సామాన్య ప్రజలకు పోలీసు శాఖపై నమ్మకం కలిగేలా నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. కర్తవ్యమే నా దైవం.. పురస్కారం అందుకున్న అనంతరం ఎస్సై నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పోలీసు వృత్తి అనేది ఒక బాధ్యత అని, ప్రజా సేవలో దక్కిన ఈ గుర్తింపు తన ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసిందని అన్నారు. ఉన్నతాధికారుల మార్గనిర్దేశంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎస్సైకి అవార్డు రావడం పట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్, తోటి సిబ్బంది మరియు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు.
Admin
E Nivas News