ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరుపట్టణంలోని, స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ మారుఫ్ ఆసియా అధ్యక్షతన సాదరణ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 8 అజెండా అంశాలను ప్రతిపాదించగా, కౌన్సిల్ సభ్యులు 8 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా 2024 - 25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ విషయంపై మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుతో చైర్ పర్సన్, కో ఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఎం.ఏ.రషీద్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News