Friday, 31 July 2026 03:54:48 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రభుత్వం బోగస్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే తొలగించాలి

జవహర్ నాయక్ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు

Date : 02 December 2025 05:04 PM Views : 431

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలల్లో,గురుకుల పాఠశాలల్లో బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేసే వారిని వెంటనే తొలగించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జవహర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నాడు ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటుచేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమావేశంలో గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జవహర్ నాయక్ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు 2011వ సంవత్సరం తర్వాత ఉద్యోగంలో చేరిన వారు తప్పనిసరిగా టెట్ పాసై ఉండాలని ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారమే నియమించబడాలి. కానీ ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా విద్యా అర్హతలు లేనివారు చాలా మంది అడ్డదారిలో ముడుపులు చెల్లించి డూప్లికేట్ ఉద్యోగులుగా నేడు పని చేస్తున్నారని, గురుకులాల్లో ఐటీడీఏ అధికారులు అక్రమ మార్గంలో ఉపాధ్యాయులుగా కొంతమందిని నియమించారని, వారు పాఠశాలకు ఎగనామం పెట్టి టెట్ కోచింగ్ లో ఉన్నారని, వారిని వెంటనే గుర్తించి,తొలగించి వారి స్థానంలో అన్ని ఆర్హతలు కలిగిన వారిని ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఉపాధ్యాయులుగా నియమించాలని ఆయన కోరారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రమోషన్లు ఉండవన్నారు. కానీ కొంతమంది అధికారులు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు కూడా ప్రమోషన్ ఇచ్చి ఎక్కువ జీతం ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులకు మనవి చేసుకుంటున్నాను.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :