ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మద్దూరు గ్రామంలో సిహెచ్ఓ కే.రేణుకాదేవి ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు బి.జ్యోతి, బి.విజయలక్ష్మి లతో కలిసి ఇంటింటికి వెళ్లి సర్వే చేసి, పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా సిహెచ్ఓ కే.రేణుకాదేవి మాట్లాడుతూ నిన్న గ్రామపంచాయతీ పరిధిలోని, మద్దూరు, కృష్ణానగర్, పెంచికలపల్లి గ్రామాలలోని, పాఠశాలల దగ్గర పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేసి 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొబైల్ టీం డాక్టర్ ఎం. మహమ్మద్ బేగ్, హెల్త్ ఎడ్యుకేటర్ జి.మల్లికార్జున లు విజిట్ చేయడం జరిగింది. రేపు ఈ మూడు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి సర్వే చేసి, పోలియో చుక్కలు వేయించుకొని పిల్లలు ఎవరైనా ఉంటే వారికి, డ్రాప్స్ వేయడం జరిగిందని అన్నారు. అందరు సహకారంతో ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని తెలియజేశారు.
Admin
E Nivas News