ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల కేంద్రంలో మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గో టు విలేజ్ కార్యక్రమంలో భాగంగా పాములపాడు ఎస్సీ కాలనీలోని, మాదిగ పేటలో విద్యార్థులకు గ్రామంలోని వారికి విద్య గురించి అవగాహన కల్పించడం ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఏ.బి.సి. లో ఉన్నటువంటి ఉపకులాల వారికి వచ్చిన రిజర్వేషన్ శాతాన్ని దృష్టిలో ఉంచుకొని మాదిగలలోని, ప్రతి ఒక్కరూ అన్ని రంగాలలో రిజర్వేషన్ లను సద్వినియోగం చేసుకోవాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు లింగాల రాంప్రసాద్ మాదిగ మరియు ఎంఎస్పి మండల అధ్యక్షుడు బొల్లెద్దుల మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
Admin
E Nivas News