ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర మహిళా సలహాదారులు సయ్యదా.అనిసా పాషా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక గౌరవ ప్రదమైన డాక్టర్ విద్యను అభ్యసించి, డాక్టర్ గా సమాజానికి సేవలందించవలసిన భావి భారత డాక్టర్ ను ఇలా అవమానించడం వలన అతని మానసిక స్థితి అర్థం అవుతుందన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సయ్యదా. అనీసా పాషా మాట్లాడుతూ మహిళలు అంటే అతని ద్రుష్టిలో ఉన్న విలువ అర్థం అవుతుంది.ఆ అమ్మాయి స్థానం నీ కూతురు, లేదా నీ కోడలు ఉంటే అప్పుడు కూడా ఇలాగే ప్రవర్తించేవాడివా? ముస్లిం మహిళలు అంటే నీకు అంత చులకన? ముస్లిం సమైక్య వేదిక దీనిని ఖండిస్తుంది. నితిశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు, కాబట్టి వెంటనే రాజీనామా చేసి గద్దె దిగాలన్నారు. భవిష్యత్ లో ఇలాంటి చర్యలు ఎవ్వరు చేసిన క్షమించేది లేదనీ, ఒక మహిళ అధ్యక్షురాలిగా, నేను అందరికీ విన్నవించుకునేది ఒక్కటే ఈ విషయంలో మహిళా సంఘాలు అన్ని ఏకమై దీనిని ఖండించి, బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలన్నారు. అలాగే దేశంలోని ప్రతి మహిళకు తను క్షమాపణ చెప్పాలన్నారు. హిజాబ్ ఒక ముస్లిం మహిళలకు రక్షణ మరియు గౌరవాన్ని కలిగిస్తుందనీ దానిని ముట్టుకునే ధైర్యం ఎవ్వరు చెయ్యరన్నారు. అలాంటిది ఇంత హేయమైన చర్చకు పాల్పపడడం చాలా దుర్మార్గమైన చర్య, దీనిని కులమతాలకు అతీతంగా ప్రతి మహిళా ఖండించాలి. గడచిన పదకొండు సంవత్సరాలలో బిజేపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ చాలా కరువైందనీ, అది కూడా రాజకీయ నాయకుల ద్వారానే, ఇంత జరుగుతున్నా మన ప్రధాన మంత్రి నోరు విప్పక పోవడం బాధాకరమన్నారు. పరదా ,దుప్పట అనేది మన భారత దేశంలో వివిధ వర్గాలో, వివిధ రకాలుగా ఆచరిస్తారన్నారు. ఈ రోజు, ఈ చర్య వల్ల మన దేశం సంస్కృతి, సాంప్రదాయాలకే చెడ్డ పేరు వచ్చిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఈ రోజు హిజాబ్, రేపు గుంగట్ తేడా లేదు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మహిళలకు రక్షణ కల్పించండి అని కోరారు.
Admin
E Nivas News