ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : ఈ రోజు కొత్తపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో ఎర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో మన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి జనసేనా పార్టి నాయకుడు ప్రవీణ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేతో విన్నవిస్తూ పోయిన వైసీపీ గవర్నమెంట్ లో శివపురం దగ్గర ఉన్న పెద్దఎద్దులేరు వాగుపై బ్రిడ్జి నిర్మించాలని చాలాసార్లు అర్జించామని కానీ ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలోనైనా మీరు ఈ వాగు పై బ్రిడ్జి నిర్మించి ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులకు దారి చూపించాలని కోరారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే- గిత్త.జయసూర్య మాట్లాడుతూ కొత్తపల్లె మండలంలో ఎటువంటి సమస్యలు ఉన్న త్వరితంగా పూర్తి చేయాలన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నడు లేని విధంగా ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో మనము ముందుకు వెళ్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ సమస్య అయినా పరిష్కారం చూపే దిశగా మన ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకి స్వీకారం చుట్టారు. ప్రతి ఒక్కరు ఒక్కసారి ఒక సమస్య తో వచ్చిన వ్యక్తికి మరల మరల రాకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మరియు కొత్తపల్లె మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
Admin
E Nivas News