Thursday, 30 July 2026 06:37:38 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

నందికొట్కూరులో భారీ జన సందోహం మధ్యన ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల ఆనంద్ కుమార్ ఆత్మీయ, అభినందన సభ

Date : 30 November 2025 08:31 PM Views : 287

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలోని, సి ఎస్ ఐ స్కూల్ ఆవరణలో జరిగిన (ఐఆర్ఎస్ ) ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ఆఫీసర్ వేల్పుల ఆనంద్ కుమార్ ఆత్మీయ, అభినందన సభకు నందికొట్కూరు, శ్రీశైలం నియోజక వర్గాల అభిమానులు రాజకీయాలకతీతంగా, కులమతాలకతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని, పోటాపోటీగా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఉదయము పాములపాడు, కొత్తపల్లి, ఆత్మకూరు, వెలుగోడు మండలాల నుండి వేల్పుల ఆనంద్ కుమార్ సైన్యం గట్టు.శంకర్ గౌడ్, వెలుగోడు గ్రామ సర్పంచ్ వేల్పుల.జయపాల్, ఎల్లగౌడు, వారి టీం ఆధ్వర్యంలో వాహనాలలో వచ్చిన వారికి పాములపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ దగ్గర టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మీద మండలాల వారికి ఆయా ప్రాంతాల్లో వేల్పుల సైన్యం ఆధ్వర్యంలో టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వాహనాలు ర్యాలీగా పాములపాడు నుండి నందికొట్కూరు పట్టణంలోని, కర్నూలు రోడ్డులో ఉన్న మార్కెట్ యార్డ్ దగ్గరకి వెళ్లి ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల ఆనంద్ కుమార్ కు ఘన స్వాగతం పలకడం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుండి మేల తాళాల మధ్యన, డీజే మధ్యన బాణాసంచా పేలుస్తూ ఐఆర్ఎస్ ఆఫీసర్ వేల్పుల ఆనంద్ కుమార్ ఊరేగింపుగా అభిమానులు తీసుకొని వెళ్లగా, ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సి ఎస్ ఐ స్కూలు దగ్గర ఆయనకు రెండు నియోజకవర్గాల అభిమానులు, వేల్పుల సైన్యం, ప్రజలు భారీ గజమాలతో ఆత్మీయ అభినందన సభకు స్వాగతం పలకడం జరిగింది. ఫంక్షన్ హాల్ లో ఆయనకు, ఆయన సతీమణికి ఆత్మీయ అభినందన సభ స్టేజి పైకి అంబేద్కర్ కళాకారుల బృందం, ప్రత్యేక మేళ వాయిద్యం ద్వారా తీసుకొని వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ అందరిని అలరించడం జరిగింది. వేల్పుల ఆనంద్ కుమార్ వెలుగోడు గ్రామంలో పుట్టి, ఆయన విద్యాభ్యాసం, ఆయన ఉద్యోగ ప్రస్థానం నుండి ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ గా ఎదిగిన విధానం గురించి డాక్యుమెంటరీ చూపించడం జరిగింది. ఈ సందర్భంగా సభలో సామాజిక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ డి.నాగన్న మాట్లాడుతూ ఐఆర్ఎస్ ఆఫీసర్ వేల్పుల ఆనంద్ కుమార్ పేదరికంలో పుట్టి, ఉన్నత స్థాయికి ఎదిగి కుల మతాలకతీతంగా, రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల వారికి తమ సహాయ సహకారాలు అందిస్తూ, తన సమాజ సేవా కార్యక్రమాల ద్వారా చిరుకాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు పొంది, అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారన్నారు. నేటి రాజకీయాలలో ఇటువంటి మేధావులు రాజకీయాలలోకి వచ్చి బ్రష్టు పట్టిన ఈ సమాజాన్ని రూపురేఖలు మార్చాలన్నారు. ఈ ఆత్మీయ, అభినందన సభలో ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ వేల్పుల ఆనంద్ కుమార్ కు నందికొట్కూరు, శ్రీశైలం నియోజవర్గాలలోని అన్ని మండలాల నుండి వచ్చిన అభిమానులు, స్నేహితులు, వేల్పుల సైన్యం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, ఉద్యోగస్తులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, బంధుమిత్రులు, స్నేహితులు, పెద్ద సంఖ్యలో వచ్చి శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి, ఘనంగా సన్మానించి, పోటాపోటీగా ఫోటోలు దిగడం జరిగింది. ఆయన అన్ని రంగాలలో ఉన్నత పదవులు సాధించాలని ఆశీర్వదించారు. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేల్పుల ఆనంద్ కుమార్ అభిమానులు, వేల్పుల సైన్యం స్వామిదాసు, రవికుమార్, పిడి నాగేంద్ర, డాక్టర్ వెంకట్ దామగట్ల ఏసన్న, తలాలి రాజు, రమేష్, మల్లయ్య, నాగన్న, జూపాడుబంగ్లా గోపాల్, సుదర్శనము, నక్కా మల్లయ్య, ఎర్రన్న, గోవర్ధన్, నారాయణ, శివ, సుంకన్న, పాములపాడు మండలం వినోద్ కుమార్, డక్కా శ్రీకాంత్, ఓబన్న గౌడ్, రెండు నియోజకవర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: