Thursday, 30 July 2026 08:18:29 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

భక్తుల భద్రత దృశ్య కాలినడక మార్గంలో పటిష్ట చర్యలు

జిల్లా ఎస్పీ సునీల్ షరాణ్ (ఐపీఎస్)

Date : 08 February 2026 08:18 AM Views : 132

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లాలోని, మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేశం నలుమూలల నుండి తరలివచ్చి ఆ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకోనున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆత్మకూరు నుండి శ్రీశైలంనకు వెళ్లే కాలినడక మార్గాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షరాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆత్మకూరు నుండి శ్రీశైలంనకు వెంకటాపురం మీదుగా నాగలూటి గూడెం, వీరభద్ర స్వామి టెంపుల్, నల్లమల్ల అడవిలో గల బేస్ క్యాంప్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీళ్లు, ఆహారం తదితర వసతులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షరాన్ మాట్లాడుతూ శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నేటి నుండి వెంకటేశ్వరపురం మీదుగా శ్రీశైలంనకు వెళ్లే కాలినడక మార్గాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ మార్గంలో భక్తుల సౌకర్యార్థం ఆహారం ,నీరు తదితర సౌకర్యాలను కల్పించడంతోపాటు భక్తుల భద్రత కొరకు కాలినడక మార్గాన్ని పోలీస్ బాంబ్ డిస్పోజల్ టీం సహాయంతో తనిఖీ చేయడం జరిగిందని, జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బందిచే కాలినడక మార్గాన్ని పోలీసు స్వాధీనంలోనికి తీసుకొని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామంజి నాయక్, ఆత్మకూరు పోలీస్ అధికారులు, ఫారెస్ట్ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్ సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :