Friday, 31 July 2026 01:42:27 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కల్లూరు జడ్పీ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, డీఈవో శామ్యూల్ పాల్, ఏపీఈడ

Date : 05 December 2025 07:47 PM Views : 221

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్/ కల్లూరు : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని, కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, డిఇఓ శామ్యూల్ పాల్, ఏపీఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని, విద్యా కమిటీ చైర్మన్ భాష లు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగ ముని మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని అన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఉపాధ్యాయులకు సహకరించాలన్నారు. విద్యార్థులు ఈరోజు కష్టపడి బాగా చదువుకుంటే రేపటి ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, డాక్టర్లుగా, సైంటిస్టులుగా, ఐపీఎస్ గా అవుతారన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండి తమ భవిష్యత్తుకు పునాదిరాళ్లు వేసుకోవాలన్నారు. సమాజం మనకెంతో ఇచ్చిందనీ, బడి ద్వారా ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉందన్నారు. క్లాస్ రూం నుంచే దేశ భవితను మార్చవచ్చని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని అన్నారు. విద్య వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలి ఈ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడానికి అందరూ కలిసి పని చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనీ, దీనికి విద్యా విధానం మెరుగవడం అత్యంత అవసరం అని అన్నారు. చిన్నప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే భయమేసేదనీ, ఇప్పుడు విద్యా విలువలను తెలుసుకుంటూ ఉందామన్నారు. తల్లికి చెప్పలేని పనిని ఎప్పుడూ చేయకూడదని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, ఇది మన అందరి బాధ్యత అని అన్నారు. పిల్లల కోసం పిల్లలకు అర్థమయ్యే విధంగా బాలల రాజ్యాంగం రూపొందించాం అన్నారు. పిల్లలతో మాక్ అసెంబ్లీని నిర్వహించామనీ, ఎమ్మెల్యేల కంటే అద్భుతంగా సమస్యలపై చర్చించారన్నారు. మహిళలను కించపరిచే విధంగా కొన్ని వాడుక పదాలు ఉన్నాయనీ, వాటిని ఎప్పుడూ వాడొద్దు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. గతంలో ఇంటి పనులు మహిళలే చేసే విధంగా పాఠ్యాంశాల్లో ఫొటోలు ఉండేవనీ, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి పనులు మహిళలతో పాటు మగవారు కూడా చేస్తున్నట్టుగా ఫొటోలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం అన్నారు. క్లిక్కర్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాం అని, పైలెట్ ప్రాజెక్టుగా భామిని మోడల్ స్కూల్లోనే అమలు చేస్తున్నాం అన్నారు. ఫిన్లాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో విద్యా విధానాన్ని పరిశీలించేందుకు టీచర్లను, విద్యార్థులను పంపుతాం అన్నారు. లీప్ యాప్ అందుబాటులోకి తెచ్చాం అని, దీని గురించి తల్లిదండ్రులకు లీప్ యాప్ గురించి తెలియచెప్పేలా చేస్తాం అన్నారు. పిల్లలు ఎలా చదువుకుంటున్నారోననే విషయాన్ని తల్లిదండ్రులు నేరుగా లీప్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. భారత దేశంలో ఆంధ్ర మోడల్ విద్యా విధానాన్ని రెండేళ్లల్లో తీసుకురావాలని సీఎం ఆదేశించారని, దీన్ని నెరవెరుస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు వద్దు... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చండి.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రభుత్వ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: