ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా, జూపాడుబంగ్లా మండలంలోని, కనకయ్యకొట్టాల జిల్లా పరిషత్ హైస్కూల్ ను డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పిల్లలకు మంచి భోజనం అందించాలని ఉద్దేశంతో సన్న బియ్యం అందిస్తుందని వంట ఏజెన్సీ వారు నిర్లక్ష్యం చేయకుండా నాణ్యమైన కూరగాయలు తెచ్చి మెనూ పాటించి పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఎలాంటి లోపాలు లేకుండా మంచిగా భోజనం అందిస్తే పిల్లలు చదువుకు దగ్గరవుతారని ఆయన అన్నారు. అలాగే అధ్యాపకులు పిల్లలకు మంచి చదువులు అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దె అవసరం ఎంతైనా ఉందని ఈరోజు బాలలే రేపటి పౌరులని దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉందని పిల్లలను చదువు రీత్యా తీర్చిదిద్దే బాధ్యత అధ్యాపకులదేనని ఆయన అన్నారు. చదువు పట్ల భోజనం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన సహించే పరిస్థితి లేదని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News