ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, ఎస్ నాగప్ప వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు ఏర్పాటుచేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని పాల్గొని పిల్లలకు రెండు చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని మాట్లాడుతూ తల్లి దండ్రులు తప్పకుండా, మరిచిపోకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు దగ్గరుండి వేపించాలన్నారు. ఆ రెండు చుక్కలు వారి జీవితంలో అంగవైకల్యం నుండి కాపాడుతుందని, వారి భవిష్యత్తును నుండి కాపాడుతుందని ఎటువంటి అనారోగ్యంలకు గురి కాకుండా చూస్తుందని ఆయన అన్నారు. పిల్లలందరికీ అందరు తప్పకుండా ప్రతి ఒక్కరు 100% పోలియో చుక్కలు వేసే విధంగా కృషి చేయాలన్నారు. ఉదయం 5:30 గంటలకు స్టాఫ్ సిబ్బంది పాల్గొని విజవంతం చేస్తున్న అందరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సులు, మేల్ నర్సింగ్ సిబ్బంది, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News