Friday, 31 July 2026 03:53:07 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కొరవడిన పర్యవేక్షణ...! అంగన్వాడి కేంద్రంలో ఫుడ్ పాయిజన్ 8 మంది చిన్నారులకు అస్వస్థత

ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారులు-నిలకడగా చిన్నారుల ఆరోగ్యం

Date : 20 November 2025 09:47 PM Views : 247

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తిన్న 8 మంది చిన్నారులకు తీవ్రస్వస్థకు గురైన ఘటన మండలంలోని, మిట్టకందాల గ్రామంలో బుధవారం కలకలం రేపింది. రోజువారి వలె గ్రామంలోని, అంగన్వాడీ కేంద్రం-3 లో మధ్యాహ్నం భోజనం కింద చిన్నారులకు ఆకుకూర పప్పు, అన్నం, కోడిగుడ్డు పెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వెళ్లిన చిన్నారులకు వాంతులు, విరేచనాలుతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైన చిన్నారులు రితిక, రిసి, నిక్షిత్ కుమార్, వసుంధర, చైతన్యకుమార్, అలేఖ్య, సంధ్య, చార్లెస్ రాజు, ఉన్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులను తల్లిదండ్రులు ఆశ వర్కర్ సహాయంతో ఆ గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రం దగ్గరికి తీసుకెల్లి అక్కడ నుండి పాములపాడు పిహెచ్సికి తరలించారు. చిన్నారులకు తీవ్ర అస్వస్థతగా ఉండడంతో అక్కడి నుండి ఆత్మకూరులోని వామిక పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఒకరి పరిస్థితి ఇబ్బందిగా ఉండడంతో నందికొట్కూరులో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. చిన్నారులకు అందించిన ఆహారంలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో అందజేసిన ఆహారం ఎలా కలుషితమైందని దానిపై చిన్నారుల తల్లిదండ్రులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. మా పిల్లల ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యానికి అయినటువంటి డబ్బులు ఎవరు భరిస్తారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లు- ఖాశీం వలి, వెంకటరాముడు లు మిట్టకందాల గ్రామ అంగన్వాడి కేంద్రాన్ని చేరుకొని ఆహారం, గుడ్లు, పాల ప్యాకెట్లను సేకరించి, వాటి నమూనాలను ల్యాబ్ కు పంపించి తదుపరి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండల అధికారులు తహాసిల్దార్- జి.సుభద్రమ్మ ఎంపీడీవో-ఎన్.చంద్రశేఖర్, ఎస్సై- కె.సురేష్ బాబు, నందికొట్కూరు సిడిపిఓ- మంగవల్లి, పాములపాడు మెడికల్ ఆఫీసర్ ఇ.వి.నాగలక్ష్మి దేవి, నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు, హెల్త్ సూపర్వైజర్లు మల్లికార్జున, మద్దయ్య, తదితరులు చేరుకొని అంగన్వాడి వర్కర్ అరుణమ్మ నుండి వివరాలను సేకరించారు. చిన్నారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :