Thursday, 30 July 2026 04:51:32 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

పాములపాడులో విబి జి రామ్ జీ పథకానికి శ్రీకారం చుట్టిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 02 July 2026 08:40 PM Views : 129

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, రైతు భరోసా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వికసిత్ భారత్ గ్రామ అభియాన్ (విభి జీ–రామ్–జీ)’ కార్యక్రమాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ 125 రోజుల ఉపాధి హామీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన లైవ్ టెలికాస్ట్ కార్యక్రమంలో అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే దేశ ప్రగతికి అసలైన బలమని పేర్కొంటూ గ్రామాల్లో సంక్షేమం, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గ్రామీణ భారతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాల పెంపు, తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల కల్పనతో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరవేయడమే వికసిత్ భారత్ గ్రామ అభియాన్ ప్రధాన లక్ష్యమని వివరించారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో పయనించేలా తాను నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో తిరుపాలు, ఈవోఆర్డి సులోచన, ఏపీవో బి.జయంతి, అగ్రికల్చర్ ఏవో ఎం.వెంకట మహేశ్వర్ రెడ్డి, పాములపాడు పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్, ఈసీ గౌస్, టిఏ లు ఎన్.స్వాములు, ఫయాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ లింగస్వామి, స్వామిదాసు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, మెట్లు, ఉపాధి హామీ శ్రామికులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :