ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : అగ్రిగోల్డ్‌కు సంబంధించి ప్రభుత్వం అటాచ్ చేసిన భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సేకరించిన వివరాలతో నివేదికను రూపొందించడం జరుగుతోందని విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గురువారం విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు రెవెన్యూ, విజయవాడ నగరపాలక సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ, సీఐడీ, ఈ-ఆక్షన్స్ తదితర విభాగాల అధికారులతో కూడిన జిల్లాస్థాయి కమిటీ విజయవాడలోని, వివిధ ప్రాంతాలను సందర్శించడం జరిగింది. లోటల్ ల్యాండ్ మార్క్, పాయకాపురం, వాంబే కాలనీలోని మూడు సర్వే నంబర్లలోని భూములను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో చైతన్య మాట్లాడుతూ అగ్రీగోల్డ్‌కు సంబంధించి ఏర్పాటైన జిల్లాస్థాయి కమిటీ సభ్యులు తాజాగా మూడు ఆస్తులను భౌతిక పరిశీలన చేయడం జరిగిందని, ఈ తనిఖీల్లో సేకరించిన ఆస్తుల సమాచారం ఆధారంగా లిటిగేషన్ లేని భూముల వేలం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా రీసర్వే, ప్రభుత్వ విలువ, మార్కెట్ విలువ, మ్యుటేషన్ తదితర వివరాలతో నివేదికలు పంపనున్నట్లు ఆర్‌డీవో చైతన్య తెలిపారు. ఈ క్షేత్రస్థాయి తనిఖీలో జిల్లా రిజిస్ట్రార్ పీవీవీ దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.
Admin
E Nivas News