Friday, 31 July 2026 01:43:12 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సరైన అవగాహనతోనే సైబర్ నేరగాళ్లకు కళ్లెం...! అనుమానాస్ప‌ద లింక్‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి

సైబ‌ర్ క్రైమ్ సీఐ- ఎన్‌.శ్రీనివాస్‌

Date : 20 January 2026 07:47 PM Views : 177

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : ప్ర‌జ‌ల కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్లు గద్దల్లా తన్నుకుపోతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌రైన అవ‌గాహ‌న ద్వారానే సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు క‌ళ్లెం వేయొచ్చ‌ని విజ‌య‌వాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ- ఎన్‌.శ్రీనివాస్ అన్నారు. మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని, ఏపీ స్టేట్ గెస్ట్ హౌజ్ ప్రాంగ‌ణంలోని జిల్లా స‌మాచార, పౌర సంబంధాల శాఖ కార్యాల‌య స‌మావేశ మందిరంలో సైబ‌ర్ నేరాల‌పై వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు, సిబ్బందికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ- ఎన్‌.శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక ప్ర‌పంచంలో ఒక‌వైపు మ‌నం ఎన్నో సౌక‌ర్యాలు పొందుతున్నాం.. ఇదే స‌మ‌యంలో మ‌రోవైపు సాంకేతిక‌త ఆస‌రాతో సైబ‌ర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నార‌ని పేర్కొన్నారు. సైబ‌ర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడం, సురక్షితంగా ఆన్‌లైన్ సేవలను వినియోగించే విధానాలపై అవ‌గాహ‌న పెంపొందించేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ముఖ్యంగా ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్ప‌ద లింక్‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. ఆశ‌, భ‌యం.. ఈ రెండే సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో చిక్కుకునేందుకు కార‌ణ‌మ‌వుతాయ‌ని.. అందువ‌ల్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సైబర్ నేరాలకు సంబంధించిన ఉదాహరణలు, ఇప్పటికే నమోదైన కేసులతో సహా వివరించి, ఎలా మోసాలు జరుగుతున్నాయో స్పష్టంగా తెలియజేశారు. డిజిట‌ల్ అరెస్టులు, ఏసీబీ అధికారుల‌మంటూ వ‌చ్చే ఫేక్ కాల్స్ త‌దిత‌రాల‌పైనా అవ‌గాహ‌న క‌ల్పించారు. ఒక‌వేళ ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాల‌ని, గోల్డెన్ అవ‌ర్‌లో టోల్ ఫ్రీ నంబర్ (1930) ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. https://www.ntrpolice.in/ వెబ్సైట్ లోని స‌మాచారాన్ని కూడా పొంది, స‌రైన అవ‌గాహ‌న‌తో సైబ‌ర్ నేర‌గాళ్ల నుంచి ర‌క్ష‌ణ పొందాల‌న్నారు. సైబర్ నేరాలపై కేవలం వ్యక్తిగతంగా కాకుండా, బంధువులు, స్నేహితులు, సహోద్యోగులతో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీఐ- ఎన్‌.శ్రీనివాస్ స్పష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో ఏఎస్ఐ బీడ‌బ్ల్యూ దాస‌న్‌, డీఐపీఆర్‌వో కేవీ.ర‌మ‌ణ‌రావు, అడిష‌న‌ల్ పీఆర్‌వో కె.ర‌వి, ఏవీ సూప‌ర్‌వైజ‌ర్ వీవీ.ప్ర‌సాద్‌, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల డీసీవో ఎ.ముర‌ళీకృష్ణ‌, భూ సేక‌ర‌ణ కోర్టు రిజిస్ట్రార్ ఎన్‌.సూర్య‌నారాయ‌ణ‌, ఐ అండ్ పీఆర్‌, డా.ఎన్‌టీఆర్ వైద్య సేవా ట్ర‌స్టు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: