Thursday, 30 July 2026 10:48:16 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

రాజ్యాంగ సమానత్వం -- ప్రజాస్వామ్య పురోగతి

డాక్టర్ బత్తుల సంజీవరాయుడు(జాతీయ బీసీల కార్యదర్శి)

Date : 23 May 2026 10:20 PM Views : 95

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు జిల్లాలోని, సునయన ఆడిటోరియంలో శ్రీ రాజీవ్ రంజన్ మిషన్ మిశ్రా బీసీ కమిషన్ వారు గ్రామీణ ,పట్టణ ప్రాంత స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లపై అధ్యయన మరియు వినతులు స్వీకరించడం జరిగింది. 138 బీసీ కులాల సంక్షేమం , అభివృద్ధి రిజర్వేషన్లపై జాతీయ బీసీల కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవరాయుడు మెమోరాండం కమీషన్ ప్రతినిధి రాజీవ్ రంజాన్ మిశ్రాకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బీసీల కార్యదర్శి డాక్టర్ బత్తుల.సంజీవరాయుడు మాట్లాడుతూ దేశ జనాభాలో బిసి, ఓబీసీ వర్గాలు సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్నప్పటికీ మాకు సంబంధించిన 138 బీసీ కులాల ఖచ్చితమైన గణాంకాలు లేవు. విద్య, ఉపాధి, రాజకీయ, సామాజిక సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి వంటి రకరకాల రంగాలలో మాకు ఇవ్వాల్సిన న్యాయపరమైన వాటా నిర్ణయించటానికి గణాంకాలు తప్పక అవసరం ఉందని. కుల గణన ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్థితిగతులు , అవసరాలు , సమస్యలు స్పష్టంగా తెలుస్తాయి. దీని ద్వారా ప్రభుత్వ విధానాలు, పథకాలు , ప్రాజెక్టులు మొదలగునవి రూపొందించవచ్చు అన్నారు. ఇది రాజ్యాంగ సమానత్వానికి అవసరమైన తొలి మెట్టు. భారత రాజ్యాంగం 15(4 ) 16( 4), 340 ద్వారా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించుటకు ప్రభుత్వం అధికారం కల్పించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల డిమాండ్లు విదేశాలలో బీసీ విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలనీ, 138 బీసీ కులాల సమగ్ర కుల గణన చేయాలి కుల వృత్తుల వారికి నైపుణ్య శిక్షణ అధునాతన పనిముట్లు మంజూరు చేయాలనీ, సుస్థిర ఆర్థిక అభివృద్ధికి కార్పొరేషన్ల ద్వారా అన్ని రకాల పథకాలు ప్రభుత్వం చేపట్టాలనీ, ద్వారా బీసీ మహిళలకు కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి గ్రామాలలో పట్టణాలలో 75% సబ్సిడీతో ఆర్థిక సాయం చేయాలనీ, రాష్ట్రంలో బీసీల సంక్షేమం ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ్డెరలు పూర్తిగా ఆర్థికంగా , సామాజికంగా రాజకీయంగా ఏమాత్రం ప్రాధాన్యత రాజకీయ పార్టీలు, ప్రభుత్వం ఇవ్వటం లేదని కావున కమిషన్ అది గుర్తించి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని , కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ కల్పిస్తూ 75 శాతాన్ని సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తే ఆర్థిక స్వావలంబన కలిగే అవకాశం ఉంటుందని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీల కమిషన్ కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిద్దె శ్రీనివాసులు , బిఎస్ఎన్ఎల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :