Friday, 31 July 2026 06:16:09 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అధికారులు ప‌టిష్ట స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి..! అత్యంత నాణ్యంగా అన్న, ఇత‌ర ప్ర‌సాదాలు అందించాలి

ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 13 February 2026 08:00 AM Views : 171

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అధికారుల‌కు సూచించారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ గురువారం క్యాంపు కార్యాల‌యం నుంచి దేవాదాయ శాఖ అధికారుల‌తో పాటు వివిధ ఆల‌యాల ఈవోలు, రెవెన్యూ, పోలీస్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త‌ల‌పై దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానంతో పాటు జిల్లా వ్యాప్తంగా శివాల‌యాల‌కు పెద్దఎత్తున భ‌క్తులు రానున్న నేప‌థ్యంలో ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. కృష్ణానదీ తీరంలోని దుర్గాఘాట్, పున్నమి ఘాట్, భవానీ ఘాట్, పవిత్ర సంగమం వంటి ప్రాంతాల్లో భక్తులు భారీ సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉన్నందున ఈ నెల 14, 15 తేదీల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘాట్ల వద్ద, క్యూ లైన్లలో నిరంతరం పహారా కాయాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు భ‌క్తుల భ‌ద్ర‌త‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ నిఘా ఉంచాలని పోలీసు శాఖ‌కు సూచించారు. బ్యారికేడింగ్‌, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అన్ని ఘాట్ల వద్ద నిరంతర పారిశుధ్య పనులు చేపట్టాలని, భక్తులకు తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సౌకర్యం కల్పించాలని విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ అధికారుల‌కు సూచించారు. విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించాలని, వివిధ ఆల‌యాల్లో ముఖ్యంగా రద్దీ సమయాల్లో తొక్కిసలాట వంటి ఘ‌ట‌న‌లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన ఘాట్ల వద్ద మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. పండ‌గ రోజుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారుల‌కు స్పష్టం చేశారు. భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకొని 15 మంది శిక్షణ పొందిన గ‌జ ఈతగాళ్లను మూడు షిఫ్టులలో ఘాట్ల వద్ద అందుబాటులో ఉంచాలని మ‌త్స్య శాఖాధికారిని ఆదేశించారు. ఎక్క‌డైనా ఎగ్జిబిష‌న్లు ఏర్పాటు చేసిన‌ట్ల‌యితే త‌ప్ప‌నిస‌రిగా వాటికి డెయిలీ ఫిట్‌నెస్ చెకింగ్ రిజిస్ట‌ర్ల‌ను నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. అగ్ని ప్ర‌మాదాలు జ‌ర‌క్కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని.. సీసీటీవీ, డ్రోన్ల‌ను కూడా ఉప‌యోగించాల‌ని సూచించారు. కంట్రోల్ రూమ్‌లు కూడా ఏర్పాటు చేయాల‌న్నారు. మ‌హిళా భ‌క్తులు, చిన్న‌పిల్ల‌లు, వ‌యోవృద్ధుల భ‌ద్ర‌త‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌న్నారు. అన్న ప్ర‌సాదంతో పాటు ల‌డ్డూ ప్ర‌సాదాలను అత్యంత నాణ్య‌త‌తో అందించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎండోమెంట్ ఆఫీస‌ర్ ఎన్‌.ష‌ణ్ముగం, ఆర్‌డీవోలు కె.బాల‌కృష్ణ‌, కె.మాధురి, స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: